Karnataka: కర్ణాటకలో మంత్రి రాసలలీల వీడియో కలకలం

Karnataka: సోషల్‌ మీడియాలో శృంగార సీడీ వైరల్‌ * రేపటి నుంచి శాసనసభ సమావేశాలు * విరుచుకుపడేందుకు విపక్షాలు సిద్ధం

Sandeep Eggoju
Updated on: 4 March 2021 6:58 AM IST
Minister Videos Issue In Karnataka
X
కర్ణాటక మినిస్టర్ రమేష్ (ఫైల్ ఇమేజ్)

Karnataka: త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్న తరుణంలో కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపింది. జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేపీటీసీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్టీ నగర్ కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేష్ జార్కి హోళి ఆమెతో రాసలీలలు జరిపినట్టుగా ఉంది. ఈ వీడియోను ఎవరు ఎక్కడ తీశారనేది స్పష్టత లేదు.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేష్ జార్కి హోళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నరమేష్ జార్కి హోళి..ఆ పార్టీ నేతలో విభేధించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుట లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేష్ జార్కి హోళి కీలకంగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మంత్రితో చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతే కాదు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్డా బెళగావి లోక్ సభ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక కూడా జరగనున్నది. మంత్రి రాసలీలల వ్యవహారం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. సభలో ఈ వ్యవహరంపై సర్కారును ఇరుకున పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.

శాసనసభలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రంగా మారకముందే మంత్రి రమేష్ జార్కిచే రాజీనామా చేయించే అంశాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని మంత్రి జార్కిహొళి స్పష్టం చేశారు. 'వీడియోను విడుదల చేసిన సామాజిక కార్యకర్త ఎవరో తెలియదు. వీడియోలో కనిపించిన యువతి ఎవరో కూడా తెలియదు. తప్పు చేసిన ట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమే' అని మంత్రి ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story