Karnataka: స్టేజిపైనే ఒకరినొకరు నెట్టుకున్న నేతలు

Karnataka: ఎంపీ, విద్యామంత్రి మధ్య మాటల యుద్ధం

Rama Rao
Published on: 3 Jan 2022 5:12 PM IST
Minister CN Ashwath Narayan and MP DK Suresh Fight at Public Event in Karnataka
X

 స్టేజిపైనే ఒకరినొకరు నెట్టుకున్న నేతలు

Karnataka: కర్ణాటకలోని రాం నగర్ లో బీజేపి నేతల మధ్య అంతర్యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారింది. నియోజక వర్గ అభివృద్ధికి సంబంధించి సీఎం బొమ్మై సమక్షంలోనే బీజేపి, కాంగ్రెస్ నేతల మధ్య వాదోపవాదాలు ఘర్షణలకు దారి తీసింది. విద్యామంత్రి అశ్వత్ నారాయణ్, ఎంపీ డీకే సురేష్ ఒకరినొకరు విమర్శించుకుని నెట్టుకోవడంతో అది ఘర్షణగా మారింది.

సమావేశం ప్రారంభానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరాలు లేవనెత్తడంతో విద్యామంత్రి అశ్వత్ నారాయణ్ ఎంపీ డీకే సురేష్ పై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. దాంతో ఎంపీ సురేష్, మంత్రి అశ్వత్ నారాయణ్ స్టేజిపైనే ఒకరినొకరు నెట్టుకున్నారు చివరకు సీఎం బొమ్మై జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rama Rao

Rama Rao

Next Story