బూట్లు త‌డుస్తాయ‌ని నీళ్ల‌లోకి దిగ‌ని మంత్రి ‌.. మోసుకెళ్లిన వైనం..

Anitha Radhakrishnan: తమిళనాడు మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ తిరువళ్లూర్ పర్యటన వివాదంగా మారింది.

Arun Chilukuri
Published on: 8 July 2021 6:23 PM IST
Minister Anitha Radhakrishnan, Doesnt Want to get his Shoes wet, Carried by a Fisherman
X

బూట్లు త‌డుస్తాయ‌ని నీళ్ల‌లోకి దిగ‌ని మంత్రి ‌.. మోసుకెళ్లిన వైనం.. 

Anitha Radhakrishnan: తమిళనాడు మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ తిరువళ్లూర్ పర్యటన వివాదంగా మారింది. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. నీళ్లలో అడుగు పెట్టేందుకు ఆయన ఇష్టపడక పోవడంతో పడవ దిగగానే కొంత దూరం ఆయన్ను స్థానికులు ఎత్తుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒక‌వేళ నీటితో న‌డిస్తే త‌న ఖ‌రీదైన బూట్లు పాడ‌వుతాయ‌ని భావించారు. దీంతో అక్క‌డున్న మ‌త్స్య‌కారులు ఆయ‌న‌ను ఎత్తుకుని తీసుకెళ్లారు. మంత్రి రాధాకృష్ణను ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనమనే విమర్శలు తమిళనాట సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story