పరుగుల కుర్రాడికి ప్రశంసల వెల్లువ.. సోషల్‌ మీడియాలో హీరోగా మారిన..

Midnight Runner Pradeep Mehra Goes Viral
x

పరుగుల కుర్రాడికి ప్రశంసల వెల్లువ.. సోషల్‌ మీడియాలో హీరోగా మారిన..

Highlights

Midnight Runner Pradeep Mehra: ఉత్తరాఖండ్‌ కుర్రాడు ప్రదీప్‌ మెహ్రా... ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరోగా మారిపోయాడు.

Midnight Runner Pradeep Mehra: ఉత్తరాఖండ్‌ కుర్రాడు ప్రదీప్‌ మెహ్రా... ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరోగా మారిపోయాడు. ఏ వేదికలో చూసినా.. అర్ధరాత్రి వేళ కుర్రాడు వీపుకు బ్యాగు తగిలించుకుని పరిగెత్తుతున్న వీడియోలే దర్శనమిస్తున్నాయి. లిఫ్ట్‌ ఇస్తానన్నా.. వద్దని.. పరుగే ప్రాధాన్యమిచ్చిన ప్రదీప్‌ను చూసి సెలబ్రిటీల నుంచి చిన్న పిల్లలవరకు అందరూ మురిసిపోతున్నారు. ఆర్మీలో చేరేందుకే రోజూ 10 కిలోమీటర్ల దూరం పరుగెడుతున్న ఈ కుర్రాడి కథ ఇప్పుడు దేశం మిత్తం వ్యాపించింది.

మార్చి 20న అర్ధరాత్రి నోయిడా రహదారిపై ప్రముఖ డైరెక్టర్‌ వినోద్‌ కాప్రీ కారులో వెళ్తుండగా ఓ యువకుడు పరుగెత్తుతూ కనిపించాడు. లిఫ్ట్‌ ఇస్తానంటే ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. తన రొటీన్‌ రన్నింగ్‌కు ఇబ్బంది కలుగుతుందన్నాడు. ఎందుకు పరిగెడుతున్నావని? అడిగితే.. ఆర్మీలో చేరేందుకని సమాధానం ఇచ్చాడు. పేరు అడిగితే ప్రదీప్‌ మెహ్రాగా తెలిపాడు. ప్రదీప్‌ రన్నింగ్‌ వీడియోను దర్శకుడు వినోద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నువ్వో బంగారం అంటూ మెచ్చుకున్నాడు. వినోద్ కాప్రీ షేర్‌ చేసిన కొద్ది సేపట్లోనే ప్రదీప్‌ వీడియో వైరల్‌గా మారింది.

ఉత్తరాఖండ్‌లోని అల్మోడాకు చెందిన ప్రదీప్‌ మెహ్రా సోదరుడితో కలిసి నోయిడాలో ఉంటున్నారు. తల్లిదండ్రులు ఉత్తరాఖండ్‌లోనే ఉంటారని అయితే తల్లికి అరోగ్యం బాగాలేకపోవడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్టు ప్రదీప్‌ చెప్పారు. తాను సెక్టార్‌ 16లోని మెక్‌ డొనాల్డ్‌లో పని చేస్తున్నానని తనకు రాత్రి పూట మాత్రమే సమయం దొరుకుతుందని పైగా రాత్రి ట్రాఫిక్‌ లేకపోవడంతో పరుగుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. తనకు బాల్యం నుంచే ఆర్మీలో చేరాలన్న లక్ష్యం ఉందని వివరించారు. అందుకే చిన్నప్పట్టి నుంచి రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వీడియో వైరల్‌ అయిన తరువాత ఉత్తరాఖండ్‌ సీఎం తనతో మాట్లాడారని తన తల్లికి వైద్యం చేయిస్తామని చెప్పినట్టు ప్రదీప్‌ మెహ్రా వివరించారు.

ప్రదీప్‌ రన్నింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. డైరెక్టర్‌తో ప్రదీప్‌ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రదీప్‌ వీడియోను యువత తెగ షేర్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలు భారీగా స్పందిస్తున్నారు. ప్రదీప్‌ వీడియోను చూసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పందించారు. తాను ఈ వీడియోను వీక్షించడం ఆపలేకపోతున్నానన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా సైతం స్పందించారు. ప్రదీప్‌ మెహ్రా నిజంగా ఇండిపెండెంట్‌.. రైడ్‌ను తిరస్కరించాడు.. అతడు ఆత్మనిర్బర్‌ అన్నారు. ప్రదీప్‌ తీరు స్ఫూర్తిదాయకమని నా మండే మోటివేషన్‌ ఇదేనని ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు.

ప్రదీప్‌ మెహ్రాకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. విశ్రాంత లెప్టినెంట్‌ జనరల్‌ సతీష్‌ దువా స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కోసం తోడ్పాటునందిస్తానన్నారు. ఆ మేరకు ప్రదీప్‌తో మాట్లాడానని తప్పకుండా సాయం అందుతుందని సతీష్‌ దువా ట్వీట్‌ చేశారు. ప్రదీప్‌ చదువుకు, అతడి తల్లి ఆసుపత్రి ఖర్చులకు నిధులను సమకూర్చటానికి తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రదీప్‌ను నటులు మాధవన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, కాజల్‌ అగర్వాల్‌తో పాటు పలువురు రాజకీయా నాయకులు, యువకును ప్రశంసిస్తున్నారు. దర్శకుడు వినోద్‌ కాప్రీ వీడియోతో ప్రదీప్‌ మెహ్రా ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగాడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories