రక్షించినందుకు చెంప దెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు

*గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వరుణ్‌నాథ్

Jyothi
Updated on: 30 Aug 2022 12:31 PM IST
Men In Gurgaon Repeatedly Slapping Apartment Security Guard
X

రక్షించినందుకు చెంప దెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు

Gurgaon Apartment: ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సాయం చేస్తే.. వారి సాయానికి కృతజ్ఞతలు లేదా తోచినంత సాయం చేస్తాం. కానీ గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి చేసిన పని.. ఆశ్చర్యం కలిగిస్తోంది. గురుగ్రామ్‌లో వరుణ్ నాథ్ అనే వ్యక్తి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్ట్‌మ్యాన్‌ని కూడా గట్టిగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ ఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

ఈ వ్యవహారంపై ఆగ్రహించిన దక్లోజ్ నార్త్ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగారు. నిందితుడు వరుణ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో ఒక మహిళ.. గేట్‌ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Jyothi

Jyothi

Next Story