Meghalaya Murder Case: హనీమూన్‌కు వెళ్లి భర్తను హత్య చేయించిన సోనమ్ – దారుణ ఘటనా వెనుక ప్లాన్!


Meghalaya Murder Case: హనీమూన్‌కు వెళ్లి భర్తను హత్య చేయించిన సోనమ్ – దారుణ ఘటనా వెనుక ప్లాన్!
మెఘాలయలో హనీమూన్ సందర్భంగా భర్తను హత్య చేయించిన సోనమ్ కేసు సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న షాకింగ్ ప్లాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మేఘాలయలోని రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు ఈ కేసు మరింత భయానకంగా మారుతోందని స్పష్టం చేస్తున్నాయి. భర్తతో హనీమూన్‌కు వెళ్లిన భార్య సోనమ్ రఘువంశీ.. పక్కా పథకంతో అతనిని హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. భర్త హత్యను ఆమె స్వయంగా ప్రత్యక్షంగా చూసిందని అధికారికంగా వెల్లడైంది.
హత్య ప్రణాళిక: హనీమూన్ నేపథ్యంగా చీకటి డ్రామా
సోనమ్ తన భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ పేరిట మేఘాలయకు వెళ్లింది. కానీ అదే ఆమె చీకటి పథకానికి వేదికగా మారింది. రాజాను హత్య చేసేందుకు సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహా, అతని మిత్రులతో కలిసి ముందుగానే ప్లాన్ వేసిందని పోలీసులు చెప్పారు. హంతకులకు రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు వెల్లడించారు.
హత్యను ప్రత్యక్షంగా చూసిన సోనమ్ – ACP ప్రకటన
ఇండోర్ ACP పూనమ్‌చంద్ యాదవ్ ప్రకారం, హంతకుల్లో ఒకరైన విశాల్ చౌహాన్ హత్య జరిగిన రోజున వేసుకున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారనీ, సోనమ్ హత్య సమయంలో అక్కడే ఉన్నదనీ, ఆమె తన భర్త మరణాన్ని ప్రత్యక్షంగా చూసిందనీ స్పష్టం చేశారు.
నలుగురు నిందితులు అరెస్ట్ – రెండు రాష్ట్రాల్లో పోలీసుల ఆపరేషన్
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆకాష్ రాజ్‌పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22), రాజ్ సింగ్ కుష్వాహా (21), ఆనంద్ కుర్మి ఉన్నారు. వారంతా ఇండోర్‌లో హత్య ప్రణాళికను తయారు చేసి మేఘాలయకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజ్ కుష్వాహా.. ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్న మాస్టర్మైండ్‌గా భావిస్తున్నారు.
భర్తను చంపాలనే పట్టుదల – ప్లాన్ ఫెయిల్ అయితే ప్రియుడి చేతులా మళ్లీ ట్రై
ఇంకా కొన్ని సొర్సుల ప్రకారం, మొదటి ప్లాన్ ఫెయిల్ అయితే భర్తను కొండ నుండి తోసేయాలని కూడా సోనమ్ భావించిందని సమాచారం. ఈ దారుణ హత్యకు సంబంధించి ప్రస్తుతం మేఘాలయ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను షిల్లాంగ్‌కు తరలించి ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై విచారణ కొనసాగుతోంది.
రాజ్ తల్లి – ‘నా కొడుకు అమాయకుడు’
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ తల్లి స్పందిస్తూ, తన కుమారుడు అమాయకుడని, అతను ఇలాంటి దారుణానికి పాల్పడే వ్యక్తి కాదని తెలిపింది. తండ్రి మరణించిన తర్వాత రాజ్ తన ముగ్గురు చెల్లెళ్ల బాధ్యతలు తీసుకున్నాడని, సోనమ్‌తో అతని సంబంధం ఏవీ తనకు తెలియవని చెప్పింది. ‘‘దయచేసి నా కొడుకును కాపాడండి, ఇదే నా చివరి కోరిక’’ అంటూ ఆమె మీడియా ముందే కన్నీరు కార్చింది.
- Meghalaya Murder Case in Telugu
- Sonam Raghuvanshi Husband Murder
- Raja Raghuvanshi Wife Plan
- Meghalaya Honeymoon Murder
- Sonam Raghuvanshi Latest Telugu News
- Raja Raghuvanshi Murder Details Telugu
- Breaking news
- Latestnews
- crime
- murder
- homicide
- criminal case
- murder mystery
- crime news
- killer
- victim
- investigation
- police report
- suspect
- arrest
- criminal investigation
- murder suspect
- planned murder
- crime scene
- criminal conspiracy
- motive
- murder plot
- violent crime
- murder case
- first-degree murder
- second-degree murder
- murder charges
- interrogation
- confession
- crime update
- breaking crime news
- murder investigation
- crime thriller
- shocking murder
- crime report

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



