logo
జాతీయం

Satya Pal Malik: రైతుల విషయంలో ప్రధాని మోడీ అహంకారి

Meghalaya Governor Satyapal Malik Hot Comments on Narendra Modi
X

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హాట్ కామెంట్స్


Highlights

Satya Pal Malik: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హాట్ కామెంట్స్


Satya Pal Malik: రైతుల ఆందోళనల విషయంలో కేంద్రాన్ని ఘాటుగా విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. తాజాగా ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రైతుల ఆందోళనల విషయమై తాను ఇటీవల ప్రధాని మోడీతో సమావేశమయ్యాయని అందులో అన్నదాతల మరణాలపై ప్రధాని మోడీ అహంకారపూరితంగా మాట్లాడారని పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అయిన 5 నిమిషాలకే వాగ్వాదం మొదలయ్యిందని 500 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని తాను చెప్పానని గుర్తు చేశారు. అయితే దీనికి తన కోసం చనిపోయారా అని మోడీ అహంకారంతో ప్రశ్నించారన్నారు. చివరకు గొడవతో ఆ సమావేశం ముగిసిందని తెలిపారు సత్యపాల్ మాలిక్.

అమిత్‌ షాతో మాట్లాడిన మాటలను వివరించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కొందరు ప్రధాని మోడీని తప్పుదారి పట్టిస్తున్నారని ఏదో ఒక రోజు ఆయనకు నిజం ఏంటో తెలుస్తుందన్నారని చెప్పుకొచ్చారు. వీడియోలో తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాలిక్‌ తన మాటల సారాంశాన్ని వివరించే యత్నం చేశారు. రైతుల సమస్యలకు సంబంధించి ప్రధాని తన అభిప్రాయాలను వినడానికి తిరస్కరిస్తూ అమిత్‌ షాను కలవమన్నారన్నారు. అమిత్ షాకు మోడీపై చాలా గౌరవం ఉందన్న సత్యపాల్ మాలిక్ ఆయన మోడీ గురించి చెడు ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

Web TitleMeghalaya Governor Satya Pal Malik Hot Comments on Narendra Modi
Next Story