ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం

ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం
x
Highlights

చైనా బోర్డర్‌లో జరిగిన పరిణామాల మధ్య ప్రధాని మోడీ నివాసంలో.. హుటాహుటిన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి...

చైనా బోర్డర్‌లో జరిగిన పరిణామాల మధ్య ప్రధాని మోడీ నివాసంలో.. హుటాహుటిన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. అలాగే త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ దగ్గర జరిగిన ఘర్షణలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చైనా దుశ్చర్యను అంతర్జాతీయంగా ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి భవిష్యత్తు వ్యూహాలు, కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories