2024 ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌.. రాత్రి ప్రధాని మోడీ నివాసంలో సీనియర్ నేతల భేటీ

Meeting of Senior leaders at Modi Residence at Night
x

2024 ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌.. రాత్రి ప్రధాని మోడీ నివాసంలో సీనియర్ నేతల భేటీ

Highlights

BJP: సమావేశంలో పాల్గొన్న అమిత్‌షా, జేపీ నడ్డా, ఇతర నేతలు

BJP: బీజేపీ అధిష్టానం 2024 ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. బుధవారం రాత్రి ప్రధాని మోడీ నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.

ఐదు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ భారీ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories