కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు

Mayawati: కాంగ్రెస్‌ పా జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 4:15 PM IST
Mayawati Slams Priyanka Gandhi
X

కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు

Mayawati: కాంగ్రెస్‌ పా జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెసే చీలుస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి బాగాలేదన్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించి కొన్ని గంటల్లోనే మాట మార్చిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను ఎత్తి చూపారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథా అవుతుందని బీఎస్పీకి ఓటేయాలని ప్రజలను మాయావతి కోరారు. ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చే పార్టీ అని మాయావతి ట్వీట్‌ చేశారు. అంతకుముందు తానే యూపీ కాంగ్రెస్‌ అభ్యర్థినని ప్రియాంకా గాంధీ హింట్ ఇచ్చారు. కొన్ని గంటల్లోనే ప్రియాంక మాట మార్చారు. పదే పదే అడుగుతున్నందుకే అలా చెప్పినట్టు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story