Kochi: కుప్పకూలిన నీటి ట్యాంక్‌.. జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు

Kochi: కుప్పకూలిన నీటి ట్యాంక్‌.. జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు
x

Kochi: కుప్పకూలిన నీటి ట్యాంక్‌.. జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు

Highlights

కేరళలోని తమ్మనం ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. కేరళ వాటర్‌ అథారిటీకి చెందిన ఫీడర్‌ వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది.

కేరళలోని తమ్మనం ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. కేరళ వాటర్‌ అథారిటీకి చెందిన ఫీడర్‌ వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది. ట్యాంక్‌లో నిల్వ ఉన్న కోటి 38 లక్షల లీటర్ల నీరు జనావాసాలపై దూసుకెళ్లింది. ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. కొన్నింటి పైకప్పులు కూలిపోయాయి. వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

కేడబ్ల్యూఏ ఫీడర్‌ పంప్‌హౌస్‌లోని ట్యాంక్‌లో కొంత భాగం ముందుగా పగిలి, ఆ వెంటనే మొత్తం నిర్మాణం కూలిపోయిందని అధికారులు తెలిపారు. నీరు ఇళ్లలోకి చొరబడటంతో అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఫర్నిచర్లు నాశనమయ్యాయి. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు ప్రవేశించడంతో మందులు, వైద్య పరికరాలు దెబ్బతిన్నాయి. ఇక ట్యాంక్‌ కూలిన నేపథ్యంలో కొచ్చి, పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేపట్టినట్లు కేడబ్ల్యూఏ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories