కరోనా ఎఫెక్ట్ : నడిరోడ్డు పైనే పెళ్లి!

కరోనా ఎఫెక్ట్ : నడిరోడ్డు పైనే పెళ్లి!
x
Highlights

కరోనా విలయం ఎన్ని ఇబ్బందులను సృష్టించిందో ఈ పెళ్లే తాజా ఉదాహరణ, ఒక పక్క పనుల్లేక పస్తులుండగా, మరో పక్క బౌతిక దూరం కారణంలో అన్ని వేడుకలు వాయిదా పడ్డాయి.

కరోనా విలయం ఎన్ని ఇబ్బందులను సృష్టించిందో ఈ పెళ్లే తాజా ఉదాహరణ, ఒక పక్క పనుల్లేక పస్తులుండగా, మరో పక్క బౌతిక దూరం కారణంలో అన్ని వేడుకలు వాయిదా పడ్డాయి. ఈ జంట ఇక ఆగలేని పరిస్థితి రావడంతో తప్పనిసరి పరిస్తితుల్లో రెండు రాష్ట్రాల సరిహద్డులో రోడ్డు మీద చేసుకోవాల్సి వచ్చింది.

గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. కొందరు ఆన్‌ లైన్‌లోన బంధుత్వాలు కలుపుకోగా.. మరికొందరు మాత్రం సింపుల్‌గా ఇరు కుటుంబాల సభ్యుల మధ్యే వివాహ కార్యక్రమాలను కానిచ్చేశారు. అయితే ఇవి సమీపంలోనే కుదిరిన పెళ్లిలు మాత్రమే. అయితే వధువరులు ఒకే ప్రాంతంలోని వారైతేనే ఇలా సాధ్యమైంది. అదే వధువరులు వేరేవేరే రాష్ట్రాలకు చెందిన వారైతే వివాహ కార్యక్రమం అనేది కాస్త ఇబ్బందులతో కూడుకున్నదే. ఎందుకంటే వారికి స్టేట్ బార్డర్ దాటేందుకు అనుమతులు తప్పనిసరి. అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. తమిళనాడు, కేరళకు చెందిన ఓ జంటకు ఈ ఇబ్బంది తలెత్తింది. కేరళకు చెందిన ప్రియాంక అనే యువతికి.. తమిళనాడుకు చెందిన రాబిన్‌సన్ అనే యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. అయితే వీరిద్దిరిది వేరువేరు రాష్ట్రాలవ్వడంతో బార్డర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.

రాబిన్‌సన్‌ది తమిళనాడులోని కోవై సమీపంలో నివాసం కాగా.. వధువు ప్రియాంకది ఇడుక్కి జిల్లా. వీరిది మార్చి 22న మూనారులోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో గత ఆదివారం నాడు ఇదే ఆలయంలో చేసుకునేందుకు ముహుర్తం పెట్టుకున్నారు. అయితే ఇందుకు వరుడి కుటుంబం

మూనారులోని ఆలయానికి రావాల్సి ఉంది అయితే ఇది సరిహద్దు ప్రాంతం కావడం.. అందులో వరుడి కుటుంబానికి కేరళ సరిహద్దు వరకు మాత్రమే అనుమతి లభించింది. దీంతో విషయాన్ని వధువు కుటుబానికి తెలియజేయడంతో.. వారు బార్డర్‌ సమీపంలో వచ్చి వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోనే ఉండి.. రోడ్డుపైనే వివాహం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories