తమిళనాడులో రికార్డు స్థాయిలో..మిగతా చోట్లా ఎక్కువగానే కరోనా కేసులు!

తమిళనాడులో రికార్డు స్థాయిలో..మిగతా చోట్లా ఎక్కువగానే కరోనా కేసులు!
x
Representational Image
Highlights

* తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,685 పాజిటివ్ కేసులు, 21 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా...

* తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,685 పాజిటివ్ కేసులు, 21 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 34,914కి చేరింది. ఇప్పటివరకు 307 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో పోరాడి రాష్ట్రంలో 18,325 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 16,279 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

* కర్ణాకటలో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. గత 24 గంటల్లో 161 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటక కరోనా కేసుల సంఖ్య 5,921కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 66 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,248 గా ఉంది. ఇప్పటివరకు 2,605 మంది కోలుకున్నారు.

* కేరళ గత 24 గంటల్లో 91 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,231 గా ఉంది. ఇప్పటివరకు 848 మంది కోలుకున్నారు.

* మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2,259 పాజిటివ్ కేసులు. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90,787కి చేరింది. కొత్తగా 120 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 50,878 గా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

* గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 470పాజిటివ్ కేసులు. ఇవాళ ఒక్కరోజే 470 మంది మృత్యువాత పడ్డారు. దీనితో గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 21,044కి చేరింది. ఇప్పటివరకు 1,313 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 14,373 మంది కోలుకున్నారు.

* పశ్చిమ బెంగాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 372 పాజిటివ్ కేసులు నమోదుచేసుకున్నాయి. దీనితో పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య 8,985కి చేరింది. ఇప్పటివరకు 415 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,950గా ఉంది.

* హరియానాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,209కి చేరింది. ఇవాళ కొత్తగా 355 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories