Maoist Hidma: హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Maoist Hidma: చనిపోయాడని వస్తున్న వార్తల్లో నిజంలేదు

Jyothi
Published on: 12 Jan 2023 3:46 PM IST
Maoist Party Release Letter on Hidma
X

Maoist Hidma: హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Maoist Hidma: మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ లేఖను విడుదల చేసింది. పార్టీ నాయకత్వానికి హాని కలిగించే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు బస్తర్‌లో వైమానిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బస్తర్ ప్రజలపై విధించిన యుద్ధానికి వ్యతిరేకంగా ఏకమై గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనేక గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దక్షణ బస్తర్‌ కొండలపై దాడి చేసి బాంబుల వర్షం కురిపించారని..అలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న వైమానిక దాడులకు వ్యతిరేకంగా దేశంలోని మరియు ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య విప్లవ శక్తులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story