మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు

దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతగా పరిగణించబడుతున్న కుంజుమ్‌ హిడ్మాని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 29 May 2025 4:07 PM IST
మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు
X

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు

కోరాపుట్‌ (ఒడిశా): దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతగా పరిగణించబడుతున్న కుంజుమ్‌ హిడ్మాని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో కీలక స్థానం occupied చేసిన హిడ్మాను కోరాపుట్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో హిడ్మా ఎన్‌కౌంటర్లో మృతి చెందాడన్న వార్తలు వచ్చినప్పటికీ, అవన్నీ వదంతులేనని ఇప్పుడు తేలిపోయింది. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హిడ్మా ఎట్టకేలకు పోలీసుల చేతిలో పట్టుబడ్డాడు. ఫోటో గానీ, స్పష్టమైన సమాచారం గానీ లేకుండా తలదాచుకుంటూ తిరిగిన హిడ్మా అరెస్ట్ పోలీసులకు కీలక విజయంగా భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story