Delhi: ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Delhi: స్కూళ్లలో తనిఖీలు కొనసాగిస్తోన్న బాంబు స్క్వాడ్‌ బృందాలు

Shashank Gullapelli
Published on: 1 May 2024 11:51 AM IST
Many Schools In Delhi Received Bomb Threats
X

Delhi: ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్ లోని మదర్ మేరీస్, సంస్కృతి పాఠశాలల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ- మెయిల్ చేశారు. సమాచారం తెలుసుకుని అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలతో స్కూళ్ల వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు. రక్షణ చర్యల్లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వారిని ఇళ్లకు పంపించారు. VPN మోడ్ లో విదేశీ మెయిల్ బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా బాంబు బెదిరింపు ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story