ముంబయికి పొంచి ఉన్న ముప్పు.. 2050 క‌ల్లా భూతాపంతో స‌ముద్ర జ‌లాల్లోకి ముంబై !

ముంబయికి పొంచి ఉన్న ముప్పు.. 2050 క‌ల్లా భూతాపంతో స‌ముద్ర జ‌లాల్లోకి ముంబై !
x

ముంబయికి పొంచి ఉన్న ముప్పు.. 2050 క‌ల్లా భూతాపంతో స‌ముద్ర జ‌లాల్లోకి ముంబై !

Highlights

*2050 క‌ల్లా భూతాపంతో స‌ముద్ర జ‌లాల్లోకి ముంబై ! *నగరంలోని పలు ప్రాంతాల్లో 80 శాతం అదృశ్యమయ్యే ప్రమాదం !

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ఆగం కానుందా ముంబై కి ముంపు పొంచి ఉందా. ప్రకృతి ముంబయికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుందా సముద్ర తీరాన ఉన్న ఈ నగరానికి ఏమైంది. 2050 సంవత్సరంలో ఏ ప్రమాదం జరుగనుంది. ముంబయి కి ముంపు పొంచి ఉంది. ఏమర పాటుగా ఉంటే అంత సర్వనాశనం కానుంది. ముంబయిలోని ఎన్నో ప్రాంతాలు సముద్ర అలల దాహానికి బలికానున్నాయని ప్రచారం జరుగుతోంది. 2050 నాటికి రాష్ట్ర సచివాలయమైన 'మంత్రాలయ', వ్యాపార కేంద్రమైన నారిమన్‌ సెంటర్లు 80 శాతం మేర కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ముంబయి మునగక తప్పదని ప్రచారం జరుగుతోంది.

సాక్షాత్తూ ముంబయి నగర పాలక సంస్థ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ ఛాహల్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. సముద్ర మట్టాలు, భారీ వర్షాల కారణంగా పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు. నగరంలోని ఏ, బీ, సీ, డీ వార్డులను సముద్రం ముంచెత్తుతుందని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ముందుస్తు చర్యలు చేపట్టాలని ఇక్బాల్‌ సింగ్‌ ఛాహల్‌ సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను వర్గీకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేతో ముంబై క్లైమేట్ యాక్ష‌న్ ప్లాన్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్క‌రించారు.129 ఏండ్ల‌లో తొలిసారి గ‌తేడాది వ‌చ్చిన నిస‌ర్గ తుఫాన్ ముంబైని ముంచెత్తింద‌ని ఇక్బాల్ సింగ్ చాహ‌ల్ గుర్తు చేశారు. గ‌తేడాది ఆగ‌స్టు 5న నారిమ‌న్ పాయింట్ వ‌ద్ద 5 నుంచి 5.5 అడుగుల నీరు నిలిచింద‌ని వివరించారు. ఇప్ప‌టికైనా మేల్కొన‌క‌పోతే భ‌విష్య‌త్ త‌రాల‌తోపాటు ప్ర‌స్తుత త‌రం కూడా ఇబ్బందుల‌ను ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories