New Army Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

New Army Chief: భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు.

Arun Chilukuri
Published on: 18 April 2022 7:21 PM IST
Manoj Pande has Been Appointed as New Army Chief
X

New Army Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

New Army Chief: భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే స్థానంలో మనోజ్ పాండే నియమితులయ్యారు. పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత, శ్రీలంకలో అల్లకల్లోలం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, అటు రష్యా-ఉక్రెయిన్ యుద్దం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బాధ్యతలు మనోజ్ పాండేకు అప్పగిస్తూ భారత డిఫెన్స్ మినిష్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా మనోజ్ పాండే భారత ఆర్మీకి 28వ చీఫ్‎గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి తర్వాత ఆయన వారసుడిగా నరవణే ను ఎంపికచేసిన కేంద్ర రక్షణశాఖ ఆయన ఈనెల30న పదవీ విరమణ నేపథ్యంలో మనోజ్ పాండేకు ఆబాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, గత మూడు నెలల్లో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉన్నతాధికారుల తరువాత సీనియర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పాండే ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story