మరోసారి రాజ్యసభ బరిలో నిలుస్తున్న మన్మోహన్‌సింగ్

మరోసారి రాజ్యసభ బరిలో నిలుస్తున్న మన్మోహన్‌సింగ్
x
Highlights

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాజ్యసభ బరిలో నిలవనున్నారు. రాజస్థాన్‌ నుంచి ఆయన పెద్దల సభకు ప్రాతినిధ్యం...

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ మరోసారి రాజ్యసభ బరిలో నిలవనున్నారు. రాజస్థాన్‌ నుంచి ఆయన పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు ఈనెల 13న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. BJP ఎంపీ మదన్‌ లాల్‌ సైనీ జూన్‌ 24న మరణించారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఒకవేళ మన్మోహన్‌ ఇక్కడ నుంచి ఎన్నికైతే ఆయన 2024 ఏప్రిల్‌ 3 వరకు ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారు. గత మూడు దశాబ్దాలుగా మన్మోహన్‌ సింగ్‌ అసోం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 2019 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది జూన్‌ 14 ఆయన పదవీకాలం పూర్తయింది.

అసోంలో కాంగ్రెస్‌కు తగినంత బలం లేకపోవడంతో ఆయన మళ్లీ రాజ్యసభకు నామినేట్‌ చేయలేదు. దీంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ ఆగస్టు 7న రాజస్థాన్‌లో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో మరోసారి మన్మోహన్‌ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ భావించింది. ఈనెల 13న నామినేషన్ వేయనున్నారు. ఇదే నెల 26న ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజున ఫలితం వెల్లడవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories