Delhi Liquor Scam: మ.3 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు మనీష్ సిసోడియా

Delhi Liquor Scam: సిసోడియాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్న సీబీఐ

Dhatripriya
Published on: 27 Feb 2023 1:47 PM IST
Manish Sisodia To CBI Special Court
X

Delhi Liquor Scam: మ.3 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు మనీష్ సిసోడియా

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సీబీఐ అధికారులు. సిసోడియాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనుంది. మరోవైపు సిసోడియా అరెస్టుపై సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. కీలకమైన అంశాలపై సిసోడియా సరిగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. తప్పించుకునే విధంగా సమాధానాలు ఇచ్చారని, విరుద్ధమైన సాక్ష్యాలను ఎదుర్కొన్నప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని ఆరోపించింది. ఈ కేసులో సిసోడియా నుంచి రాబట్టాల్సిన సమాచారం ఎంతో ఉన్నందున. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story