Assembly Election 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం

Assembly Election 2022: మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

Arun Chilukuri
Published on: 28 Feb 2022 7:34 AM IST
Manipur Election 2022 phase 1 Polling in 38 Seats Under Way
X

Assembly Election 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం

Assembly Election 2022: మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఐదు జిల్లాల్లోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్‌ బూత్‌లకు తరలివస్తున్నారు. మణిపూర్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో మొత్తం 173 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 15 మంది మహిళా అభ్యర్థులున్నారు. తొలిదశలో ఎన్నిక జరగనున్న సీట్లలో 29, ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్తో పాటు బిష్ణుపూర్లో ఉండగా.. మిగిలిన 9 స్థానాలు కంగ్పోక్పీ, చురాచంద్పూర్, పెర్జవాల్ జిల్లాల్లో ఉన్నాయి. ఇక రెండో విడత ఎన్నికలు మార్చి 5న జరగనున్నాయి. రెండో విడతలో 22 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇక మార్చి 10 అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story