Dr Manik Saha: త్రిపుర కొత్త సీఎంగా మాణిక్‌ సాహా

Dr Manik Saha: వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న త్రిపురలో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 14 May 2022 9:15 PM IST
Manik Saha to be New Tripura CM
X

Dr Manik Saha: త్రిపుర కొత్త సీఎంగా మాణిక్‌ సాహా

Dr Manik Saha: వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న త్రిపురలో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సీఎంగా డాక్టర్ మాణిక్‌ సాహాను త్రిపుర బీజేఎల్పీ ఎన్నుకుంది. మాణిక్‌ సాహా రేపు ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న బిప్లవ్‌దేవ్‌ గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. బిప్లవ్ దేవ్ స్థానంలో కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న మాణిక్‌ సాహా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

ఉత్తరాఖండ్ బాటలో ఎన్నికల ముందు సీఎం మార్పు త్రిపుర రాజకీయాలను షేక్ చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన ఒకరోజు వ్యవధిలోనే బిప్లవ్‌దేవ్ సీఎం పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్రిపురలో బీజేపీని మళ్లీ అధికారంలో తెచ్చేందుకు పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు మాణిక్ షా.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story