Liquor Baba: ఫుల్‌ కొట్టు.. ఫ్యూచర్‌ పట్టు అంటున్న ఫుల్‌బాటిల్‌ బాబా

* పురుషులైనా.. స్త్రీలు అయినా మందు కొట్టాల్సిందే *భక్తులకు తీర్థంగా మందును ఇస్తున్న బాబా *ఆశ్రమంకు క్యూ కడుతున్న భక్తులు

Sandeep Reddy
Published on: 6 Sept 2021 2:04 PM IST
Mani Baba Will Say Future of his Devotees After Drinks the Full Bottle Liquor in Tamil Nadu
X

తమిళనాడులో ఫుల్‌బాటిల్‌ బాబా 

Liquor Baba: కొందరు బాబాలు చిత్ర విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తన్నులతో దోషాలు పొగడతామంటే.. ముద్దులతో మీ సమస్యలు తీరుస్తామంటూ మోసాలకు పాల్పడుతుంటారు. అయితే ఓ బాబా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఓ ఫుల్ బాటిల్ ఇస్తే మీ జాతకం చెప్పేస్తానంటున్నాడు. జరిగింది.. జరిగేది.. జరగబోయేది.. చెప్పేస్తున్నాడు కూడా. దీంతో ఆ బాబా కోసం జనం క్యూ కడుతున్నారు. కార్లేసుకుని వచ్చి మరీ స్వామికి క్వార్టర్ పోసి దాన్నే తీర్థంగా తీసుకుని వెళ్తున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు.

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఈ వింత విడ్డూరం‌ జరుగుతోంది. ఏపీకి చెందిన మణి గత పదేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆ ఊరి ఆలయం వద్ద పనిచేస్తూ తొలుత రోజుకు 5వందలు నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించేవాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఆలయం వద్ద తానే ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మణిబాబాగా అవతారమెత్తాడు. మాట తీరు ఆకర్షణీయంగా ఉండటంతో వారికి, వీరికి జాతకాలు చెప్పడం మొదలు పెడ్టాడు. అతను చెప్పేవన్నీ జరుగుతున్నాయని ప్రచారం జరగడంతో.. క్రమం క్రమంగా అతని దగ్గరకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

దీంతో ఫ్యూచర్‌ చెప్పేస్తానంటూ ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అయితే ఫుల్ బాటిల్ తెస్తేనే..! అని షరతులు పెట్టాడు.కొందరికి పూజలు చేస్తే పూనకం వస్తుంది.. ఇంకొందరు కనికట్టు చేస్తే భవిష్యత్తు ఎరుకవుతుందంటారు. కానీ ఈ మణిబాబాకు కిక్ ఎక్కితే తప్ప భవిష్యవాణి పలకదు. ఫుల్ బాటిల్ ముందుపెడితే చాలు.. అడిగిన వాడి ఫ్యూచర్ వారి చేతుల్లో పెట్టేస్తాడు. చుక్కనోట్లో పడితే జరిగింది.. జరుగుతుంది.. జరగబోయేది.. మొత్తం చెప్పేస్తాడు. ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తాడు. అంతేకాదు అక్కడుకు వచ్చిన కొందరు భక్తులు బాబా ఇచ్చిన మందును తీర్థంలాగా స్వీకరిస్తారు.

మందు మత్తులో నిజంగానే ఫ్యూచర్‌ చెబుతున్నాడని నమ్మి అతడి ఆశ్రమానికి క్యూ కడుతున్నారు భక్తులు. బాబా దగ్గరకు పురుషులతో పాటు మహిళలు కూడా ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నారట. అంతేకాదు అతడి ఆశ్రమ వద్ద కార్లు బారులు తీరుతున్నాయి. మరి ఈ బాబా చెప్పే జ్యోతిష్యంలో ఎంత నిజముందోకానీ.. అశ్రమంలో మాత్రం లిక్కర్ ఏరులై పారుతోంది. ఈయన ఎఫెక్ట్ తో అక్కడ లిక్కర్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందట.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story