Siddaramaiah Security: అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఉన్న సీఎం వద్దకు పరిగెత్తాడు.. అంతా షాక్!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 15 Sept 2024 3:44 PM IST
Siddaramaiah Security: అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఉన్న సీఎం వద్దకు పరిగెత్తాడు.. అంతా షాక్!
X

Man Runs Towards Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆదివారం ఊహించని అనుభవం ఎదురైంది. సిద్ధరామయ్య ఒక బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా వేదికపై కూర్చున్నారు. అదే సమయంలో స్టేజీకి ముందు భాగంలో కూర్చున్న ఒక 24 ఏళ్ల యువకుడు ఉన్నట్లుండి ముఖ్యమంత్రి వైపు పరుగులుతీశారు. దాదాపు ఒక్క గెంతులో వేదికపైకి ఎక్కారు. మరో ఒకట్రెండు అడుగుల్లో అతడు సీఎం సిద్ధరామయ్యను చేరుతారనగా వెంటనే అక్కడే ఉన్న సీఎం సెక్యురిటీ విభాగం అప్రమత్తమైంది.

వేదికపై ఉన్న భద్రతా బలగాలు వెంటనే అతడిని అడ్డుకుని పక్కకు లాగిపడేశాయి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఆ యువకుడు ఎవరు, ఎందుకు ముఖ్యమంత్రి వైపు పరుగెత్తారు?

ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఎవరు, ఎందుకు ఈ పనిచేశారు అని ఆరాతీశారు. కనక్‌పుర ప్రాంతంలోని తల్గట్‌పురకి చెందిన మహదేవగా పోలీసులు గుర్తించారు. ముందు నుండి సిద్ధరామయ్య అంటే అతడికి చాలా ఇష్టమని.. సిద్ధరామయ్యకు శాలువా కప్పాలనే ప్రయత్నంతోనే తాను ఆ పని చేశానని పోలీసులకు చెప్పారు. మహదేవ వేదికవైపు పరుగెత్తినప్పుడు అతడి చేతిలో శాలువా ఉండటం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story