Uttar Pradesh: పెళ్ళిచేసుకోవడానికి నిరాకరించిందని.. యువతి గొంతుకోసి కాలువలో పడేసిన యువకులు

Uttar Pradesh: పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

Shekhar G
Published on: 20 Sept 2023 10:55 AM IST
Man Accused Of Stabbing Dalit Woman Arrested After Police Shootout In UP Sultanpur
X

Uttar Pradesh: పెళ్ళిచేసుకోవడానికి నిరాకరించిందని.. యువతి గొంతుకోసి కాలువలో పడేసిన యువకులు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌లో వినాయక చవితి పండుగ రోజే రక్తం చిందింది.. పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై ఇద్దరు యువకులు దాడి చేశారు. యువతి గొంతు కోసి కాలువలో పడేసి పారిపోయారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని కాపాడి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

యువతికి అంతకు ముందే పరిచయం ఉన్న గౌస్‌ఖాన్‌ అనే వ్యక్తి ద్వారా యువతిని నదీతీరానికి పిలిపించిన జమాఖాన్‌ అనే యువకుడు పెళ్లికోసం యువతిపై ఒత్తిడి చేశాడు.. తనకు వేరే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమయ్యిందని చెప్పడంతో యువతిపై హత్యాయత్నం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు గౌస్‌ఖాన్‌, అఫ్రోజ్‌ అనే మరోవ్యక్తి తారసపడ్డారు. తప్పించుకోవడానికి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరూ గాయపడ్డారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. ఇద్దరు నిందితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గౌస్‌ఖాన్‌, జమాఖాన్‌, అఫ్రోజ్‌ ముగ్గురిపై పలు కేసులు నమోదయ్యాయి.

Shekhar G

Shekhar G

Next Story