ఈ నెల 10న భవానీపూర్ ఉప ఎన్నికకు దీదీ నామినేషన్

* నామినేషన్ ప్రకటన సందర్భంగా మమతా ఆసక్తికర వ్యాఖ్యలు * అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయో ఆ భగవంతుడికే తెలుసు: మమతా

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 9:31 PM IST
Mamata Banerjee Will do Nomination for the Bhawanipur byelection on the 10 09 2021
X

మమతా బెనర్జీ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవానీపూర్ ఉపఎన్నిక కోసం ఈనెల 10న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు దీదీ ప్రకటించారు. ఏడాది ఆరంభంలో ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో కేవ‌లం ఆ భ‌గ‌వంతుడికి మాత్రమే తెలుస‌ని దీదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావ‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే హింసాత్మక ఘ‌ట‌న‌ల‌కు పాల్పడ్డార‌న్న మమతా.. పైగా ఇప్పుడు త‌ప్పు త‌మ‌పై మోపుతూ అబ‌ద్దాలు చెబుతున్నాని ఆరోపించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story