West Bengal: పాత వీడియోలను బీజేపీ సర్క్యులేట్‌ చేస్తోంది- మమత

West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యాక రాజకీయ హింస చెలరేగడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు.

Arun Chilukuri
Published on: 6 May 2021 3:56 PM IST
Mamata Banerjee said that Most of the videos of violence being shared on Social Media Were either fake or old
X

West Bengal: పాత వీడియోలను బీజేపీ సర్క్యులేట్‌ చేస్తోంది- మమత

West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యాక రాజకీయ హింస చెలరేగడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. హింసాత్మక ఘటనలను సహించేది లేదని, తప్పుడు కథనాలతో ఉన్న పాత వీడియోలను బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని ఆమె తప్పుపట్టారు. బీజేపీ గెలిచిన చాలా చోట్ల ఇంతకంటే కల్లోల ఘటనలు సంభవించాయని అన్నారు. పాత వీడియోలను సర్క్యులేట్ చేయడం బీజేపీ మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలోని శాంతి భద్రతలను సమీక్షించారు దీదీ. ఎన్నికల సమయంలో ఈసీ నియమించిన డీజీపీని మార్చి..అంతకు ముందు ఉన్న డీజీపీని తిరిగి నియమించారు మమతా బెనర్జీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story