Top
logo

Bengal: నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయం- అమిత్‌షా

Mamata Banerjee Runs Bengal on 3T model, says Amit Shah
X

Bengal: నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయం- అమిత్‌షా

Highlights

Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజు రోజుకూ హీటెక్కుతోంది.

Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజు రోజుకూ హీటెక్కుతోంది. ఇప్పటికి రెండు దశల పోలింగ్‌ ముగిసింది. మరో ఆరు దశలు జరగాల్సి ఉంది. బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మమత సర్కార్‌పై నిప్పులు కురిపిస్తున్నారు. నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయమని ప్రచారం చేస్తున్నారు. కూచ్ బిహార్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం 3టీ మోడల్‌ను అనుసరిస్తోందని విమర్శించారు. ఈ మూడు టీలను అమిత్‌షా వివరించారు. తానాషాహి..టోలాబాజీ...తుష్టీకరణ్ విధానాన్ని మమత ప్రభుత్వం అనుసరిస్తోందని దుయ్యబట్టారు.

Web TitleMamata Banerjee Runs Bengal on '3T' model, says Amit Shah
Next Story