Mamata Banerjee: దాడి జరిగిందనడానికి ఆధారాల్లేవు- ఈసీ

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందనడానికి ఆధారాల్లేవని ఈసీ తెలిపింది.

Venkata Chari
Published on: 13 March 2021 6:54 PM IST
Mamata Banerjee: No Evidence on Nandigram Incident
X

మమతా బెనర్జీ (ఫైల్ ఫొటో)

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందనడానికి ఆధారాల్లేవని ఈసీ తెలిపింది. ఘటనపై విచారణ జరిపిన ఎన్నికల పరిశీలకులు మమతపై దాడి చేసే అవకాశమే లేదని ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు.

ఈనెల 10న మమతా బెనర్జీ నందిగ్రామ్ పర్యటనలో ఉన్న సమయంలో కాలి గాయంతో హాస్పిటల్‌లో చేరారు. తమపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. దీంతో ఘటనపై విచారణ జరిపిన ఎన్నికల పరిశీలకులు దాడి జరిగే అవకాశమే లేదని ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. కాగా, నిన్న టీఎంసీ ప్రతినిధులు నందిగ్రామ్ ఘటనపై ఈసీ కి ఫిర్యాదు చేసి, సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story