డార్జిలింగ్‌ కొండలపై పది కి.మీ రన్నింగ్ చేసిన మమతా బెనర్జీ

అయితే శుక్రవారం ఉదయం మాత్రం ఆమె డార్జిలింగ్ కొండలపై ఉత్సాహంగా పరుగెత్తారు. డార్జిలింగ్ లోని కూర్పేయాంగ్ లో రన్నింగ్ చేస్తూ మధ్యలో స్థానిక ప్రజలను పలకరించారు.

Samba Siva Rao
Updated on: 3 Aug 2020 4:12 PM IST
డార్జిలింగ్‌ కొండలపై పది కి.మీ రన్నింగ్ చేసిన మమతా బెనర్జీ
X

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డార్జిలింగ్ కొండల్లో పది కిలో మిటర్ల పాటు జాకింగ్ చేశారు. రోజూ తెల్లవారుజామున ట్రెడ్ మీల్ పై వాకింగ్ ప్రారంబిస్తారు మమతా బెనర్జీ. అయితే శుక్రవారం ఉదయం మాత్రం ఆమె డార్జిలింగ్ కొండలపై ఉత్సాహంగా పరుగెత్తారు. డార్జిలింగ్ లోని కూర్పేయాంగ్ లో రన్నింగ్ చేస్తూ మధ్యలో స్థానిక ప్రజలతో మమేకమయ్యారు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లెమేట్ యాక్షన్ సందర్భంగా ఏకంగా 10 కిలోమిటర్లు జాగింగ్ చేసిన సీఎం మమత యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె వెంట భద్రతా సిబ్బందితోపాటు పలువురు పాత్రికేయులు కూడా ఉన్నారు. మమతా బెనర్జీ జాగింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలని, పచ్చదనాన్ని కాపాడాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story