ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర దొరికిన పేలుడు పదార్ధాల కేసులో కీలక మలుపు

Arun Chilukuri
Updated on: 6 March 2021 7:03 AM IST
ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర దొరికిన పేలుడు పదార్ధాల కేసులో కీలక మలుపు
X

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర దొరికిన పేలుడు పదార్ధాల కేసులో కీలక మలుపు

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర దొరికిన పేలుడు పదార్ధాల కేసు కీలక మలుపు తిరిగింది. వారం రోజులక్రితం ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. ముఖేష్ నివాసానికి సమీపంలో పేలుడు పదార్ధాలున్న కారును అంబానీ భద్రతా సిబ్బంది గుర్తించారు. దాంతో, పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకుని పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేశారు.

ఆ తర్వాత కారులో పేలుడు పదార్ధాలు పెట్టింది తామేనంటూ ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, పేలుడు పదార్ధాలతో దొరికిన కారు ఓనర్‌‌ను మన్‌సుఖ్ హిరేన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే, ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరేన్ ఇవాళ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, మన్‌సుఖ్ హిరేన్ వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story