Encounter: ఢిల్లీ రోహిణిలో ఎన్‌కౌంటర్‌.. బిహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

Encounter: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Oct 2025 11:03 AM IST
Encounter: ఢిల్లీ రోహిణిలో ఎన్‌కౌంటర్‌.. బిహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
X

Encounter: ఢిల్లీ రోహిణిలో ఎన్‌కౌంటర్‌.. బిహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

Encounter: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్లు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిహర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు బడా గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు.

మృతుల్లో గ్యాంగ్‌లీడర్ రంజక్ పాఠక్, బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story