Maoists: రూ. 3 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా 11 మంది లొంగుబాటు

Maoists: రూ. 3 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా 11 మంది లొంగుబాటు
x

Maoists: రూ. 3 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా 11 మంది లొంగుబాటు

Highlights

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. ఏకంగా రూ. 3 కోట్ల రివార్డు కలిగిన కీలక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ సహా మొత్తం 11 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. ఏకంగా రూ. 3 కోట్ల రివార్డు కలిగిన కీలక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ సహా మొత్తం 11 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటు ప్రక్రియతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

లొంగిపోయిన వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రాంధేర్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయన ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) జోన్‌లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. మావోయిస్టు అగ్ర నాయకుడు మిళింద్ తెల్టుంబే మరణించినప్పటి నుంచి, రాంధేర్ ఆ ఎంఎంసీ జోన్ బాధ్యతలను చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాంధేర్ లొంగుబాటు అనేది ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా మారే దిశగా పురోగతి సాధించినట్లైంది.

ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లో పోలీసుల ఎదుట మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్న ధోరణి కొనసాగుతోంది. ప్రభుత్వ లొంగుబాటు విధానాలు, భద్రతా దళాల ముమ్మర ఆపరేషన్లే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories