Mahindra: కొత్త వాహ‌నం కొనాల‌నుకుంటున్నారా? మహీంద్ర ఆఫ‌ర్ మీకోస‌మే

Mahindra: క‌రోనా వ్యాప్తి అన్ని రంగాల‌పై ప‌డింది. ఈ నేపథ్యంలో విక్ర‌యాలు కూడా త‌గ్గిపోయాయి.

Samba Siva Rao
Published on: 2 Jun 2021 7:24 PM IST
Mahindra Vehicals Purchases
X

మహీంద్రా లోగో వికీపీడియా 

Mahindra: క‌రోనా వ్యాప్తి అన్ని రంగాల‌పై ప‌డింది. ఈ నేపథ్యంలో విక్ర‌యాలు కూడా త‌గ్గిపోయాయి. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లపై ఆర్థిక బారం ప‌డ‌డంతో వాహ‌నదారులు కొలుగోలుకు వెన‌క్కిత‌గ్గారు. ఈ క్షీణతను అధిగమించేందుకు మహీంద్రా సంస్థ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు వాహనాలు కొంటే, మూడ్నెల్ల తర్వాత ఈఎంఐలు కట్టుకోవచ్చంటూ ప్రజలను ఊరిస్తోంది. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మహీంద్రా వాహనాన్ని ఇప్పటికిప్పుడే సొంతం చేసుకోవచ్చని తెలిపింది.

యాక్సెసరీస్ వ్యయం, వర్క్ షాపు చార్జీలు వంటి ఇతర చెల్లింపులను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాదు, కొనుగోలుదారులను ఆకర్షించేలా తన 'ఓన్ లైన్' ప్లాట్ ఫామ్ ద్వారా రుణ సదుపాయం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రూ.3 వేల విలువైన యాక్సెసరీస్, లోన్ సమయంలో రూ.2 వేల విలువైన బెనిఫిట్స్... ఇలా అనేక ఆఫర్లు ప్రకటించింది. వాహనానికి సంబంధించిన వారెంటీ పొడిగింపు, కొనుగోలు సమయంలో ఈఎంఐ చెల్లించాల్సిన పనిలేదని, మూడ్నెల్ల తర్వాత మొదటి ఈఎంఐ చెల్లించవచ్చంటూ తన ఆఫర్ ను వివరించింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story