పోలీసుల‌పై ఉమ్మేసిన కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా

Netta D'Souza: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రణరంగంగా మారింది.

Arun Chilukuri
Updated on: 21 Jun 2022 7:30 PM IST
Mahila Congress President Netta DSouza Spits at Police Personnel
X

పోలీసుల‌పై ఉమ్మేసిన కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా

Netta D'Souza: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రణరంగంగా మారింది. మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ నెట్టా డిసౌజా పోలీస్ సిబ్బందిపై ఉమ్మివేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ED దర్యాప్తును నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. ఈ నేపథ్యంలో డిసౌజాతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు ఉమ్మివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story