Tushar Gandhi: గాంధీజీ మునిమనవడు సంచలన వ్యాఖ్యలు

Tushar Gandhi: దేశంలో అమృతం విషంగా మారుతుందున్న తుషార్‌ గాంధీ

Rama Rao
Updated on: 31 Jan 2022 1:54 PM IST
Mahatma Gandhi Great Grandson Tushar Gandhi Made Sensational Comments
X

గాంధీజీ మునిమనవడు సంచలన వ్యాఖ్యలు

Tushar Gandhi: జాతిపిత, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గాంధీ మార్గం కన్నా ఆయనను అంతమొందించిన గాడ్సే సిద్ధాంతాలే ప్రబలంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అమృతం విషంగా మారుతోందని తుషార్‌ గాంధీ విమర్శించారు.

స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్‌ మమోత్సవాలు జరుపుకుంటున్నా సమాజంలో విద్వేషపూరిత విషం వ్యాపిస్తోందని తుషార్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ బోధనలపై ఆయనను హతమార్చిన గాడ్సే భావజాలం ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు.

దేశంలో ఒకవర్గం చరిత్రను వక్రీకరించి తమదైన రీతిలో తిరిగి రాస్తున్నట్టు తుషార్‌ గాంధీ ఆరోపించారు. సమాజంలో ద్వేషం, విభజనకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు. మహాత్ముడి వర్దంతి సందర్భంగా జేఈఎస్‌ కళశాలలోని గాంధీ స్టడీ సెంటర్ నిర్వహించిన కర్‌కే దేకో కార్యక్రమంలో విర్చువల్‌గా తుషార్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు.


Rama Rao

Rama Rao

Next Story