వరదలోకి దూకిన యువకుడు.. సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్న వీడియో

వరదలోకి దూకిన యువకుడు.. సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్న వీడియో
x
Highlights

Maharashtra: మహారాష్ట్రలో వర్షాలు భీకరంగా కురుస్తున్నాయి. వరదలన్నీ ఉగ్రరూపం దాలుస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్రలో వర్షాలు భీకరంగా కురుస్తున్నాయి. వరదలన్నీ ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మాలేగావ్‌ ప్రాంతంలోని గిర్ణా నదికి కూడా వరద పోటెత్తింది. వరదను చూడడానికి భారీగా జనం మాలేగావ్‌లోని బ్రిడ్జివద్దకు చేరుకున్నారు. అయితే అందరూ చూస్తుండగానే ఓ యువకుడు హీరోలా ఉన్నట్టుండి నదిలోకి డైవ్‌ కొట్టాడు. అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. ఏం జరగుతోందో తెలుసుకునేలోపే ఆ యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెండ్రోజుల పాటు గాలించాయి. అయినా ఆ యువకుడి జాడ లభించలేదు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గల్లంతైన యువకుడిని నయూం అమిన్‌గా గుర్తించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories