Maharashtra: చమురుపై వ్యాట్ తగ్గించిన ఏక్‎నాథ్ సర్కారు

Maharashtra: పెట్రోలుపై 5రూపాయలు, డీజిల్ పై 3 రూపాయలు

Rama Rao
Updated on: 14 July 2022 6:30 PM IST
Maharashtra to Cut Petrol and Diesel Prices
X

Maharashtra: చమురుపై వ్యాట్ తగ్గించిన ఏక్‎నాథ్ సర్కారు

Maharashtra: చమురు ధరలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని వ్యాట్ తగ్గిస్తూ కాసింత ఊరటనిచ్చారు. భారీగా పెరిగిన ఇంధన ధరల విషయంలో ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే ఆ రాష్ట్ర ప్రజలకు కొంత ఊరట కల్పించారు. లీటరు పెట్రోలుపై 5 రూపాయలు డీజిల్ మీద 3 రూపాయలు తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబైలో 11 రోజులుగా 111 రూపాయలు దాటిన లీటరు పెట్రోలు కాస్తా తాజా తగ్గింపుతో 106 రూపాయల 35 పైసలకు తగ్గింది. ఇక ఇప్పటిదాకా 97 రూపాయలకు పైబడిగా ఉన్న లీటరు డీజిల్ ధర ఇకపై 94 రూపాయల 28 పైసలకు చేరింది. ఈ నిర్ణయంతో వాహనదారులకు కొంతమేర ఊరట లభించే అవకాశం ఏర్పడింది.

Rama Rao

Rama Rao

Next Story