Coronavirus: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

Coronavirus:(Photo The Hans India)
Coronavirus: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 60వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
Coronavirus: మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో 59,907 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క రోజే దాదాపు 60వేల కేసులు వచ్చాయన్న మాట. ఇక ఇవాళ 30,296 మంది వ్యాధి నుంచి కోలుకుంటే..322 మంది మరణించారు. అక్కడ రికవరీల కంటే రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50శాతం పైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 31,73,261 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 26,13,627 మంది కోలుకోగా.. 56,652 మంది మరణించారు. ప్రస్తుతం 5,01,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పుణెలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఇవాళ ఆ ఒక్క జిల్లాలోనే 10,907 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,832 మంది కోలుకోగా.. మరో 62 మంది మరణించారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే వారంతాపు లాక్‌డౌన్ విధించారు. శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుంది. రాత్రిళ్లు 9 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారు. సినిమా హాళ్లు, పార్క్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్ అవే సదుపాయం మాత్రమే ఉంది.
ఈ వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సైతం కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీడ్ జిల్లా అంబజోగై పట్టణంలో ఒకే చితిపై 8 మృతదేహాలను అధికారులు దహనం చేశారు. ''అంబజోగై పట్టణంలోని శ్మశానవాటికలో కరోనా రోగుల మృతదేహాలను దహనం చేయబోతే స్థానికులు వ్యతిరేకించారు. దీంతో పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలోని మాండవా రోడ్డులో మరో స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాం'' అని మున్సిపల్ మండలి అధికారి అశోక్ సాబలే తెలిపారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
తీర్పులను విమర్శించండి.. తీర్పులనిచ్చే జడ్జిలను కాదు.. జస్టిస్ యూయూ...
15 Aug 2022 4:00 PM GMTRevanth Reddy: ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ...
15 Aug 2022 3:30 PM GMT'ఎట్ హోమ్' కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు.. ఆఖరి నిమిషంలో..
15 Aug 2022 3:00 PM GMTHyderabad: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం
15 Aug 2022 2:30 PM GMTతెలంగాణ ఉద్యమకారుడు నాగరాజుకు షర్మిల ఆర్థిక సాయం
15 Aug 2022 2:00 PM GMT