Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

Maharashtra Home Minister Anil Deshmukh Resigns
x

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

Highlights

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ పై వ‌చ్చిన‌ అవినీతి ఆరోప‌ణ‌లపై 15 రోజుల్లో ప్రాథమిక ద‌ర్యాప్తు పూర్తి చేయాల‌ని సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచార‌ణ‌లో ఆధారాలు ల‌భ్య‌మైతే ఎఫ్ఐఆర్ న‌మోదుకు ఆదేశించింది.

అనిల్ దేశ్‌ముఖ్‌ నెలకు రూ.100 కోట్ల వ‌సూళ్లను పోలీసులకు ల‌క్ష్యంగా పెట్టారంటూ మ‌హారాష్ట్ర‌ సీఎం ఉద్ధవ్ థాక‌రేకు ముంబై మాజీ సీపీ ప‌రంవీర్ ‌సింగ్ లేఖ రాయడం పెద్ద దుమారం రేపింది. దీంతో మాజీ సీపీ చేసిన‌ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని న్యాయ‌వాది జ‌య‌శ్రీ పాటిల్ ఇటీవ‌ల హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ జ‌రిపిన న్యాయ‌స్థానం 15 రోజుల్లో ప్రాథమిక ద‌ర్యాప్తు పూర్తి చేయాల‌ని సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనిల్ దేశ్ ముఖ్ హోంమంత్రిగా ఉన్న నేప‌థ్యంలో ఈ ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర పోలీసుల‌తో విచారణ జ‌రిపిస్తే అది నిష్పాక్షికంగా కొన‌సాగే అవ‌కాశం లేద‌ని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది.

Show Full Article
Print Article
Next Story
More Stories