Maharashtra: బ్రేక్‌ ద చైన్‌ పేరిట కఠిన ఆంక్షలు

Maharashtra Government Strats the Break the Chain Rule Due To Corona Cases Expanding
x

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Maharashtra: శుభకార్యాలకు 25 మందికి మాత్రమే అనుమతి * నిబంధనలు అతిక్రమిస్తే రూ.50వేలు ఫైన్‌

Maharashtra: కరోనా ఉద్ధృతి నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు 15శాం సిబ్బందితో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా తాండవం చేస్తోంది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్‌ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించినా వైరస్‌ బ్రేకులు పడకపోవడంతో.. "బ్రేక్‌ ద చైన్‌"

పేరిట మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాన్నీ 15శాతం మందితో మాత్రమే పనిచేసేందుకు అవకాశం కల్పించింది. వివాహాలు వంటి శుభకార్యాలకు 25 మంది మించరాదని పరిమితి విధించింది. ఇక నిబంధనల్ని అతిక్రమిస్తే 50వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఇకపై ప్రైవేటు వాహనాలను అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని.. అదీ డ్రైవర్‌తో కలిపి 50శాతం ప్రయాణికుల సామర్థ్యం మించరాదని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అయితేనే నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే 10వేల జరిమానా విధించడంతోపాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ప్రైవేటు బస్సులు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణాలపైనా నియంత్రణ ఉంటుందని తెలిపింది. సిటీలో రెండు స్టాప్‌ల కన్నా మించి బస్సుల్ని ఆపరాదని సర్వీస్‌ ఆపరేటర్లను ఆదేశించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తానికి ఇవాళ్టి రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు కొత్తగా ప్రకటించిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories