మహారాష్ట్రలో గవర్నర్, సీఎం మధ్య లెటర్ వార్

మహారాష్ట్రలో గవర్నర్, సీఎం మధ్య లెటర్ వార్
x
Highlights

గవర్నర్ వర్సెస్ సీఎం యుద్ధం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎప్పుడెప్పుడో బెంగాల్‌లో ఇలాంటి వ్యవహారం హీట్ పుట్టించింది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్,...

గవర్నర్ వర్సెస్ సీఎం యుద్ధం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎప్పుడెప్పుడో బెంగాల్‌లో ఇలాంటి వ్యవహారం హీట్ పుట్టించింది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్, గవర్నర్ కోశ్యారీ మధ్య లెటర్ వార్ నడిచింది. ఆలయాలు తెరిచే వ్యవహారంపై గవర్నర్ ఇలా ఓ మాట అన్నారో లేదో అలా వెంటనే ఠాక్రే రియాక్ట్ అయ్యారు.

ఆలయాలతో పాటు ఇతర ప్రార్థనామందిరాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య లేఖలయుద్ధం హాట్‌హాట్‌గా సాగింది. ముఖ్యమంత్రిగారు ఒక్కసారిగా లౌకికవాదిగా మారిపోయారా అని గవర్నర్‌ సెటైర్లు వేస్తే తనకెవరూ పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదంటూ ఠాక్రే స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు లేఖ రూపంలో ! ఇద్దరి మధ్య ఈ యుద్ధం ఇప్పుడు రాజకీయంగానూ సెగలు పుట్టిస్తోంది.

కరోనా కారణంగా రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనామందిరాలను ఈ ఏడాది మార్చి నుంచి క్లోజ్ చేశారు. ఐతే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో రీ ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌ కోశ్యారీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. రాస్తే రాశారు ఊరుకున్నారా అంటే కాస్త ఘాటుగానే పదాలు చొప్పించారా లేఖలో ! మీరు బలమైన హిందుత్వ వాది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయోధ్యను సందర్శించి శ్రీరాముడిపై భక్తిని చాటుకున్నారు. విఠల్ రుక్మిణి మందిరంలో పూజలు చేశారు. అలాంటిది రాష్ట్రంలో ఆలయాలను మాత్రం తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌ను తెరిచి దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారని ఇలా చేయమని భగవంతుడి నుంచి ఆదేశాలు వచ్చాయా లేదా లౌకికవాదిగా మారారా అంటూ కోశ్యారీ లేఖలో ప్రశ్నించారు.

ఇక ఈ లేఖకు ఉద్ధవ్ కూడా స్ట్రాంగ్‌గానే రెస్పాండ్ అయ్యారు. ప్రార్థనమందిరాలు తెరిస్తే హిందుత్వవాది తెరవకపోతే లౌకికవాది అని గవర్నర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. లౌకికవాదం అనేది రాజ్యాంగంలోని కీలకమైన అంశంమని ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. భగవంతుడి నుంచి ఆదేశాలు వచ్చాయా అని అడిగారు కదా అలాంటివి మీకు వస్తాయోమో అంత గొప్పవాడిని నేను కాదండూ మరో లేఖ రూపంలో సమాధానం చెప్పారు. ఇప్పటికే బీజేపీ వర్సెస్ శివసేన అన్నట్లుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ లేఖల యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories