BJP MLA Shoots Shiv Sena Leader: శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..

Maharashtra Bjp Mla Allegedly Shoots At Shiv Sena Leader Inside Police Station
x

BJP MLA Shoots Shiv Sena Leader: శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..

Highlights

BJP MLA Shoots Shiv Sena Leader: కాల్పులు జరిపిన గణేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

BJP MLA Shoots Shiv Sena Leader: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ గైక్వాడ్ కాల్పులు జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌ హిల్‌లైన్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ సీనియర్‌ అధికారి ఎదుటే ఈ కాల్పులు జరగడం గమనార్హం. భూ వివాదానికి సంబంధించి పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు మహేశ్, గణేశ్‌లు వారి మద్దతుదారులతో వచ్చారని వచ్చారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందన్నారు. దీంతో గణేశ్‌ గైక్వాడ్‌.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనలో శివసేన ఎమ్మెల్యే రాహుల్‌ పాటిల్‌‌కు సైతం గాయలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. గణేశ్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మహేశ్ గైక్వాడ్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories