లూడో గేమ్‌లో తండ్రి చీట్ .. కోర్టుకెక్కిన కూతురు!

Father Cheats Ludo Game : లూడో గేమ్‌లో తండ్రి తనను ఓడించాడని ఓ కూతురు కోర్టును ఆశ్రయించింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Krishna
Published on: 27 Sept 2020 2:08 PM IST
లూడో గేమ్‌లో తండ్రి  చీట్ .. కోర్టుకెక్కిన కూతురు!
X

Father Cheats Ludo Game : లూడో గేమ్‌లో తండ్రి తనను ఓడించాడని ఓ కూతురు కోర్టును ఆశ్రయించింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే... భోపాల్‌కు చెందిన ఓ 24 ఏళ్ల యువతికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. వాళ్లిద్దరూ ఖాళీ సమయంలో లూడో ఆడేవారు. అయితే ఒక రోజు ఆటలో తండ్రి ఓడించడంతో ఆమె కుంగిపోయింది. తనను ఎంతో ఇష్టపడే నాన్న.. తనని మోసం చేశాడని భరించలేకపోయింది. దీనితో తన తండ్రి పైన ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం వచ్చిన కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం నాలుగు రౌండ్ల కౌన్సిలింగ్‌ తరవాత ఆ యువతి సానుకూలంగా స్పందించడంతో విషయం సద్దుమనిగింది. దీనిపైన భోపాల్ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ సరిత మాట్లాడుతూ.. 24 ఏళ్ల మహిళ గత కొద్ది రోజుల క్రితం తన వద్దకు వచ్చిందని, ఈ ఆటలో తన తండ్రి ఆమె ఆనందం కోసం ఆటలో ఓడిపోవాలని ఆమె భావిస్తున్నది. నాలుగు రౌండ్ల కౌన్సిలింగ్‌ అనంతరం ఆ యువతి సానుకూలంగా స్పందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు నెటిజన్లు కూడా దీనిపైన మీమ్స్ చేస్తున్నారు.


Krishna

Krishna

Next Story