Madhya Pradesh: విచిత్ర బంధం.. పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్న జంట

Madhya Pradesh: కరోనా వచ్చినా.. కళ్యాణం వచ్చినా అగదు.

Samba Siva Rao
Updated on: 27 April 2021 10:45 PM IST
Madhya Pradesh: విచిత్ర బంధం.. పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్న జంట
X

Madhya Pradesh: కరోనా వచ్చినా.. కళ్యాణం వచ్చినా అగదు. ఇదీ ఎదో సమేతలా ఉందా? అవును అలానే ఉంటుంది. ఈ జంట కష్టాలు అన్ని ఇన్ని కాదు. పాడైనా కరోనా పెళ్లి ముందే రావడంతో వరుడు కష‌్టాలు మాములుగా లేవు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. కొందరు పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో వివాహాలు జరిపించేస్తుంటే.. మరికొందరు మాత్రం ఉందిలే మంచికాలం ముందు ముందునా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఒక విచిత్రమైన పెళ్లి.. విశేషంగా నిలిచింది. పెళ్లికోసమని అన్నీ సిద్ధం చేసుకున్నారు. తీరా.. వరుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వివాహాన్ని వాయిదా వేశారు అనుకుంటున్నారా..? కాదు.. పీపీఈ కిట్లు ధరించి మరీ ఒక్కటయ్యారు ఆ జంట. అంతేకాదు.. హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాట్నంలో జరిగిన ఈ పెళ్లి వేడుక.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story