IG Lakshmi Singh: లఖీంపూర్ ఘటనపై ఆశీష్ మిశ్రాకు సిట్ నోటీసులు

IG Lakshmi Singh: లఖీంపూర్ ఖేరీ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2021 9:30 PM IST
Lucknow IG Lakshmi Singh Told two People Have Been Questioned in the Lakhimpur Kheri Case
X

IG Lakshmi Singh: లఖీంపూర్ ఘటనపై ఆశీష్ మిశ్రాకు సిట్ నోటీసులు

IG Lakshmi Singh: లఖీంపూర్ ఖేరీ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హింసాత్మక ఘటనలో విచారణకు హాజరుకావాలని సమన్లలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ లక్ష్మీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించి చాలా ఆధారాలు లభించాయని, ఇద్దరిని విచారిస్తున్నామన్నారు.

మరోవైపు ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా వాదిస్తున్నారు. ఆశిష్ అక్కడ ఉన్నట్లు ఒక్క ఆధారం కూడా దొరకలేదన్నారు. అలాంటి ఆధారం ఏ ఒక్కటి దొరికినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు లాంటి పూర్తి వివరాలతో రేపు నివేదికను సమర్పించాలని యూపీ సర్కార్‌ను ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story