Kisan Credit Card: రైతులకి గమనిక.. తక్కువ వడ్డీకే రూ.3లక్షల వరకు రుణాలు..!

Low-Interest Loans of up to Rs 3 Lakh to Farmers under Kisan Credit Card | Live News
x

Kisan Credit Card: రైతులకి గమనిక.. తక్కువ వడ్డీకే రూ.3లక్షల వరకు రుణాలు..!

Highlights

Kisan Credit Card: ప్రాచీనకాలం నుంచి భారతదేశం వ్యవసాయ దేశం. ఇప్పటికి ఇక్కడ చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు.

Kisan Credit Card: ప్రాచీనకాలం నుంచి భారతదేశం వ్యవసాయ దేశం. ఇప్పటికి ఇక్కడ చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. దేశ జిడిపిలో వ్యవసాయం 17 నుంచి18 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది. ఈ పథకాలలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒకటి. దీనివల్ల రైతులకు సులువుగా రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది.

వాస్తవానికి తుఫాను, అధిక వర్షాల వల్ల చాలాసార్లు రైతులు పంటలు కోల్పోతారు. నష్టాలని చవిచూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడంతో జీవితం మొత్తం ఆ అప్పులు కట్టడంతోనే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం రైతులకి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద రూ.3 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రభుత్వం రైతులకు తక్కువ వడ్డీ రేటుకు 3 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీకే ఇస్తారు. ఈ కార్డ్‌ని పొందాలంటే మీకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. అదే సమయంలో గరిష్టంగా 75 సంవత్సరాల వరకు రైతు ఈ క్రెడిట్ కార్డ్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రైతు భూమి పత్రాలు ఉండాలి.

KCC కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. తర్వాత అన్ని పత్రాలను సమర్పించాలి. దీని తర్వాత మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందుతారు. ఇది కాకుండా మీరు బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories