రాజస్థాన్‌లో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో..

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 10 Oct 2021 7:25 PM IST
Love Affair Man Beaten To Death In Rajasthan
X

రాజస్థాన్‌లో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో..

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితుడు జగదీష్‌ను కర్రలతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని హనుమన్‌ఘర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం ఆరుగురు వ్యక్తులు కలిసి కర్రలతో చితకబాదడంతో దెబ్బలకు తాళలేక బాధితుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 11మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం స్థానిక పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story