కాంగ్రెస్ సీనియర్ నేతల తీరుపై అధిర్ రంజన్ ఘాటు విమర్శలు

కాంగ్రెస్ సీనియర్ నేతల తీరుపై అధిర్ రంజన్ ఘాటు విమర్శలు
x
Highlights

కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చిన సీనియర్ నేతల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన...

కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చిన సీనియర్ నేతల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన జరగాలంటున్న నేతలు అద్దంలో చూసుకుని, ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్‌ వంటి నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధిర్ రంజన్ చౌదరి స్పందించారు.

పార్టీపై మీడియాలో ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమయ్యే వరకు ఎందుకు వేచి చూడడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ సమావేశంలో మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుందన్నారు. బిహార్ శాసన సభ ఎన్నికల్లో జరిగిన నష్టం గురించి మాట్లాడాలనుకుంటే, సరైన సమయం వరకు వేచి చూడాలన్నారు. ఎన్నికల్లో జరిగిన నష్టంపై పుండు మీద కారం జల్లినట్లు మాట్లాడటం సరి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ సంస్కృతి ఉందని, దాని వల్లే నేతలు నేడు ఈ స్థాయిలో ఉన్నారన్నారు. దానిపై వారు దాడి చేయకూడదన్నారు. రాహుల్ గాంధీని మాత్రమే నిందించడం వల్ల ఎటువంటి పరిష్కారం ఉండదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories