లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసంలో విషాదం

Arun Chilukuri
Published on: 30 Sept 2020 10:07 AM IST
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసంలో విషాదం
X

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌ నిబంధనల నడుమ స్వస్థలం రాజస్తాన్‌లోని కిషోరాపూర్‌ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా పితృవియోగంతో విషాదంలో మునిగిపోయిన ఓం బిర్లా, ఆయన కుటుంబానికి సహచర ఎంపీలు, బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీకృష్ణ బిర్లా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story